RRR Movie Trailer Postponed And Here Is The Reasons: ధర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కాంబినేషనల్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీసారర్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమా థియేటరికల్ ట్రైలర్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఇవాళ (డిసెంబర్ 1) ప్రకటించారు. అయితే డిసెంబర్ 3న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించినా ప్రముఖ సినీ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతోపాటు పలు అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు బుధవారం ఉదయం చిత్రబృందం తెలిపింది. త్వరలో ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది.
అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్న ఈ సినిమాను సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ టాలీవుడ్‌లోకి అరంగ్రేటం చేయనుంది. ఇందులో ఆమెకు రామ్ చరణ్ జోడిగా నటించనున్నారు. ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ అలరించనుంది. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: ఐటెం సాంగ్ అడిగిన నెటిజన్‌కు 'ఆర్‌ఆర్‌ఆర్' టీం రిప్లై..
Comments
Please login to add a commentAdd a comment