Mahesh Babu With Balakrishna in Unstoppable Talk Show - Sakshi
Sakshi News home page

Mahesh Babu With Balakrishna: అన్‌స్టాపబుల్‌ షోలో సూపర్‌ స్టార్‌ సందడి.. ఫొటోలు వైరల్‌

Published Mon, Dec 6 2021 12:23 PM | Last Updated on Mon, Dec 6 2021 12:36 PM

Mahesh Babu With Balakrishna In Unstoppable Talk Show - Sakshi

Mahesh Babu In Unstoppable Talk Show: సినిమాలోతోనే కాకుండా హోస్ట్‌గా తనలోని మరో టాలెంట్‌ను బయటపెడుతూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే' అనే షోలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్‌షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధరణ లభిస్తుంది. ఓటీటీ చరిత్రలోనే అత్యధికి వ్యూస్‌తో ఈ షో సంచలనం సృష్టించినట్లు ఇటీవల 'ఆహా' అధికారికంగా ప్రకటించింది. ఈ షోలో ఇప్పటికే కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ, నాచురల్‌  స్టార్‌ నాని, బ్రహ్మానందం, డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి వచ్చి ప్రోగ్రామ్‌ను విజయవంతం చేస్తున్నారు. 

అయితే తాజాగా ఈ షోకు సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తయింది. ఈ ఇంటర్వ్యూ ఫొటోలు సోషల్‌ మీడియాలో అన్‌స్టాపబుల్‌ అంటూ దూసుకుపోతున్నాయి. బాలకృష్ణ, మహేశ్‌ బాబుతో ఎపిసోడ్‌ ఆద్యంతం సరదాగా గడిచిందని సమాచారం. నవ్వులు, ప్రేక్షకుల చప్పట్లతో షో సందడిగా మారిందట. ఈ సాయంత్రం బాలకృష్ణతో ఎంతో సరదాగా గడిచిందని మహేశ్‌ బాబు తన ఇన్‌స్టాలో స్టోరీ కూడా పెట్టారు. అయితే బాలకృష్ణ, మహేశ్ బాబు కలిసి ఓ టాక్‌షోలో కనిపించడం ఇదే మొదటిసారి. వీరిద్దరి మధ్య ఫన్‌ ఎలా ఉంటుంది అనేది చూడాలంటే పూర్తి ఎపిసోడ్‌ విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే. మహేశ్‌ బాబు రాకతో 'అన్‌స్టాపబుల్‌' టాక్‌షో టీఆర్‌పీ రేటింగ్స్‌ ఓ రేంజ్‌లో పెరగే అవకాశాలు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement