Mahesh Babu In Evaru Melo Koteeswarudu, Promo Viral On Social Media - Sakshi
Sakshi News home page

Mahesh Babu In EMK: మహేశ్‌ బాబు ఎంట్రీతో మరింత జోష్‌గా..

Published Tue, Nov 23 2021 2:09 PM | Last Updated on Tue, Nov 23 2021 3:30 PM

Mahesh Babu Participating Promo Of Evaru Meelo Koteeshwarulu - Sakshi

Mahesh Babu In Evaru Meelo Koteeshwarulu: బిగ్‌బాస్‌తో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించే రియాలి​​​టీ షోలలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఒకటి. దీనికి హోస్ట్‌గా చేస్తున్న యంగ్‌ టైగర్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ తనదైన స్టైల్‌తో ప్రేక్షకుల్లో ఫుల్‌ జోష్‌ నింపుతున్నాడు. ఎన్టీఆర్‌కు తోడుగా మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వనున్నారు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు. తాజాగా వీరిద్దరూ కలసి ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ స్టేజిపై సందడి చేశారు. మహేశ్‌ బాబు అతిథిగా వచ్చిన ఈ పోగ్రాం ప్రత్యేక ఎపిసోడ్‌ ప్రోమోను షో మేకర్స్‌ విడుదల చేశారు. ఈ ఇద్దరు హీరోలను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 

ఈ ప్రోమోలో 'వెల్‌కమ్‌ మహేశ్‌ అన్న' అంటూ తారక్‌ ఇన్వైట్ చేస్తే.. 'అదిరిపోయింది' అని సూపర్‌ స్టార్‌ బదులిచ్చాడు. తర్వాత 'నా రాజా..' అంటూ ఎన్టీఆర్‌ తనదైన మ్యానరిజంతో జోష్‌ నింపారు. 'కరెక్ట్‌ ఆన్సర్‌నే అటూ, ఇటూ ఎందుకు తిప్పుతారు' అని మహేశ్‌ అడిగినా ప్రశ్నకు 'సరదా కోసం' అని ఎన్టీఆర్‌ సమాధానమిస్తారు. దీంతో కంప్యూటర్‌ను 'దీనికన్నా గురువు గారే బెటర్‌గా ఉన్నారు' అన్న మహేశ్‌ మాటకు షోలో నవ్వులు విరబూసాయి. ఇంతకుముందు ఈ షోకు రామ్‌ చరణ్‌, సమంత వచ్చి సందడి చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు మరింత అలరించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement