Mahesh Babu And Ntr Participating In Evaru Meelo Koteeshwarulu - Sakshi
Sakshi News home page

బుల‍్లితెరపై మహేశ్‌ బాబు-ఎన్టీఆర్‌ సందడి.. ఫ్యాన్స్‌కి పూనకాలే..

Published Sat, Nov 20 2021 12:57 PM | Last Updated on Sat, Nov 20 2021 1:18 PM

Mahesh Babu And Ntr Participating In Evaru Meelo Koteeshwarulu - Sakshi

Mahesh Babu And Ntr Participating In Evaru Meelo Koteeshwarulu: బిగ్‌బాస్‌తో పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించే మరో రియాలిటీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. గత సీజన్‌లు స్టార్‌ మాలో ప్రసారమవగా దీనికి హోస్ట్‌గా కింగ్‌ నాగార్జున, చిరంజీవిలు వ్యవహరించారు. అయితే ఈ సారి ఈ రియాలిటీ షోకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తనదైన మ్యానరిజం, చమత్కారంతో షోను ఆసక్తిగా మలుస్తున్నారు. ఈ షోకు రామ్‌ చరణ్‌, సమంత వచ్చి సందడి చేసి ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఈ షోకు రానున్నారు. మహేశ్‌ బాబు-యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇద్దరు కలిసి షోలో మరింత సందడి చేయనున్నారు. 

దీనికి సంబంధించిన ఎపిసోడ్ త్వరలో ప్రారంభంకానుంది. ఈ షోలో ఇద్దరూ పాల్గొన్న ఓ పోస్టర్‌ను సదరు టీం పోస్ట్‌ చేసింది. దీనికి పూనకాల ఎపిసోడ్‌ లోడింగ్‌ అని టైటిల్‌ పెట్టింది. దీంతో నెటిజన్లు వేయిటింగ్‌ అని కామెంట్‌ చేస్త్నునారు. ఇక మహేశ్‌ బాబు-యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో ఈ షో ఎపిసోడ్‌ ప్రారంభమైతే ఈ ఇద్దరూ హీరోల ఫ్యాన్స్‌కి పండగే. ఈ ఒక్క ఎపిసోడ్‌తో 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోకు రేటింగ్‌ భారీగా పెరిగే ఛాన్స్‌ ఉంది. 

చదవండి: రూ.కోటి గెలిచినా దక్కేది ఇంతేనా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement