
Mahesh Babu In Evaru Meelo Koteeshwarudu: యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ‍్యవహరిస్తున్న షో 'ఎవరు మీలో కోటీశ్వరులు (EMK)'. ఈ రియాలిటీ షోలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పాల్గొన్న సంగతి తెలిసిందే. తనదైన జోష్‌తో ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్‌కు తోడుగా ప్రొగ్రామ్‌కు తన రాకతో మరింత గ్లామర్ యాడ్ చేశారు మహేశ్. ఇటీవల రిలీజైన ప్రొమో ప్రస్తుతం ప్రసారం అవుతోంది. ఆ ప్రోమోలు ఎన్టీఆర్, మహేశ్ ఇద్దరూ కలిసి ఎలా సందడి చేశారో చూశాం. ఇక మహేశ్ బాబు పాల్గొన్న ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది. ఈ క్రమంలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోగ్రామ్‌లో 'టక్కరి దొంగ' ఎంత గెలుచుకున‍్నాడో అని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చి, నవ్వులు పంచి, తనదైనా డైలాగ్‌లతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేశ్ బాబు రూ. 25 లక్షలు గెలుచుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆ మొత్తాన్ని అంతా ఛారిటీ కోసం కేటాయించి తన మంచి మనసు చాటుకున‍్నాడట ఈ శ్రీమంతుడు. అయితే మహేశ్ బాబు ఎంత గెలుచుకున్నాడు ? ఎన్టీఆర్ అడిగినా ప్రశ్నలేంటి ? వాటికి 'పోకిరి' ఎలా సమాధానమిచ్చాడు ? అనేది ఈ గ్లామరస్ ఎపిసోడ్ ప్రసారం అయితే గానీ చెప్పలేం.
ఇదీ చదవండి: మహేశ్ బాబు ఎంట్రీతో మరింత జోష్‌గా..