Radhe Shyam 2nd Song: Radheshyam Movie Second Song "Aashique Aa Gayi" Released - Sakshi
Sakshi News home page

Radheshyam Second Song: రాధేశ్యామ్‌ రెండో సాంగ్‌.. ఫ్లర్టేషన్‌షిప్‌ కోరుకుంటున్నాడట

Published Wed, Dec 1 2021 12:48 PM | Last Updated on Wed, Dec 1 2021 12:54 PM

Radheshyam Movie Second Song Aashique Aa Gayi Released - Sakshi

Radheshyam Movie Second Song Aashique Aa Gayi Released: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తోన్న 'రాధేశ్యామ్‌' సినిమా నుంచి మరో సాంగ్‌ వచ్చేసింది. ముందుగా హిందీలో చిత్రీకరించిన ఆషికీ ఆ గయా సాంగ్‌ను బుధవారం (డిసెంబర్‌ 1) విడుదల చేశారు మేకర్స్‌. పాట ఆరంభంలో 'నిన్ను నువ్వు రోమియో అనుకుంటున్నావా ?' అని పూజా, ప్రభాస్‌ను అంటే.. 'అతడు ప్రేమ కోసం ప్రాణాలిచ్చాడు. నేను ఆ టైపు కాదు' అని ప్రభాస్‌ బదులిస్తాడు. దీనికి 'కానీ, నేను జూలియెట్‌. నన్ను ప్రేమిస్తే తప్పకుండా చచ్చిపోతావ్‌' అని పూజా రొమాంటిక్‌గా వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో 'కానీ నేను మాత్రం ఫ్లర్టేషన్‌షిప్‌ కోరుకుంటున్నా' అంటూ ప్రభాస్‌, పూజను కిస్‌ చేయడంతో పాట మొదలవుతుంది. 

ఈ సాంగ్‌లో విజువల్స్‌ చాలా రిచ్‌గా ఉన్నాయి. ప్రభాస్‌, పూజాల లుక్స్‌ అభిమానులకు పండగలా అనిపిస్తాయి. ప్రస్తుతం హిందీలో విడుదలైన 'ఆషికీ ఆ గయా సాంగ్‌'ను తెలుగులో నగుమోము తారలేగా బుధవారం సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ పాటను సిద్‌ శ్రీరామ్‌ ఆలపించాడు. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్‌ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో ప్రభాస్ పల్మానాలజిస్ట్‌గా ఆకట్టుకోబోతున్నాడు. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇది చదవండి: ‘రాధేశ్యామ్‌’ ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement