వారికి బాగా డబ్బులు రావాలి : రవితేజ | Ravi Teja Says Krack Movie Will Be A Super Hit | Sakshi
Sakshi News home page

సక్సెస్‌మీట్‌లో కలుద్దాం: రవితేజ

Published Fri, Jan 8 2021 12:07 PM | Last Updated on Fri, Jan 8 2021 12:10 PM

Ravi Teja Says Krack Movie Will Be A Super Hit - Sakshi

‘‘డాన్‌ శీను, బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్, నా కాంబినేషన్‌లో వస్తున్న ‘క్రాక్‌’ హ్యాట్రిక్‌ హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను. మధు, అమ్మిరాజులకు ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి బాగా డబ్బులు రావాలి. మళ్లీ ‘క్రాక్‌’ సక్సెస్‌మీట్‌లో కలుద్దాం’’ అన్నారు రవితేజ. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’. సరస్వతి ఫిలింస్‌ డివిజన్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా రేపు (శనివారం) రిలీజవుతోంది.

ఈ సందర్భంగా ‘క్రాక్‌’ ప్రీ రిలీజ్‌ వేడుకలో గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ – ‘‘సంక్రాంతి పండక్కి ముందే మాకు పెద్ద పండగ రానుంది. నాకు సినీ జీవితాన్నిచ్చిన రవితేజగారికి కృతజ్ఞతలు. మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘క్రాక్‌’ కచ్చితంగా హ్యాట్రిక్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘సంక్రాంతి కానుకగా ఈ నెల 9న మా ‘క్రాక్‌’ భారీగా విడుదలవుతోంది. ఈ అవకాశం ఇచ్చిన మధు, రవితేజ, గోపీచంద్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అమ్మిరాజు. ‘క్రాక్‌’ మొదటి, రెండో టికెట్‌ను దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్‌ రావిపూడి కొనుగోలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement