NBK 107: Balakrishna And Shruti Haasan Movie Starts In Hyderabad - Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రారంభమైన బాలకృష్ణ 107వ సినిమా

Published Sun, Nov 14 2021 10:41 AM | Last Updated on Sun, Nov 14 2021 11:21 AM

NBK 107: Balakrishna And Shruti Haasan Movie Starts In Hyderabad - Sakshi

బాలకృష్ణ నటిస్తున్న 107 సినిమాకి కొబ్బరికాయా కొట్టారు. ఈ చిత్రానికి గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతీ హాసన్‌ హీరోయిన్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహుర్తపు సన్నివేశాలనికి దర్శకుడు బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్‌ చేయగా.. డైరెక్టర్‌ వివి వినాయక్‌ క్లాప్‌ ఇచ్చారు. దర్శకులు కొరటాల శివ, బాబీ, బుచ్చిబాబు కలిసి స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందించారు. వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం తమన్‌ అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement