
గోపీచంద్ మలినేని, రవితేజ, వై. రవిశంకర్, నవీన్ ఎర్నేని
‘డాన్ శీను, బలుపు, క్రాక్’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
వాస్తవ ఘటనల ఆధారంగా ఓ పవర్‌ఫుల్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమాలోని కీలక పాత్రల్లో దర్శక–నటుడు సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్ నటించనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జీకే విష్ణు.
Comments
Please login to add a commentAdd a comment