
ప్రస్తుతం డిస్కోరాజా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మాస్ మహారాజ్ రవితేజ ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు. గతంలో రవితేజ హీరోగా బలుపు లాంటి హిట్ సినిమాను అందించిన గోపిచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శృతిహాసన్ సడన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. దీంతో శృతి రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కొంతకాలంగా రీ ఎంట్రీకి రెడీ అవుతున్న శృతి రవితేజ, గోపిచంద్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈసినిమా సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment