మెగా హీరోకు భారీ టార్గెట్ | Sai Dharam tej Targets Big | Sakshi
Sakshi News home page

మెగా హీరోకు భారీ టార్గెట్

Published Sat, Feb 18 2017 11:37 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

మెగా హీరోకు భారీ టార్గెట్ - Sakshi

మెగా హీరోకు భారీ టార్గెట్

వరుస హిట్స్తో దూసుకుపోతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్, మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో విన్నర్గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు సాయి. ఇప్పటి వరకు మీడియం బడ్జెట్ సినిమాలతో మంచి కమర్షియల్ హిట్స్ అందుకున్న సాయి ఈ సారి మాత్రం రిస్క్ చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

విన్నర్ సినిమాను సాయి ధరమ్ గత సినిమాలతో పోలిస్తే భారీ బడ్జెట్తో రూపొందించారు. హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్, విలన్గా జగపతిబాబు లాంటి టాప్ స్టార్స్తో పాటు భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్టిస్ట్ల రెమ్యూనరేషన్కే 11 కోట్ల వరకు అయ్యిందన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఫారిన్ షూట్లు, హార్స్ రేసింగ్ సీన్లతో కలిపి బడ్జెట్ 24 కోట్లకు చేరింది.

సాయి ధరమ్ రికార్డ్, గోపిచంద్ మలినేని మీద ఉన్న అంచనాల నేపథ్యంలో సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఈ సినిమా ఓవర్సీస్తో కలిపి దాదాపు 30 కోట్ల వరకు బిజినెస్ అయిపోయింది. అంటే విన్నర్ 30 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తేనే విన్నర్ హిట్ లిస్ట్లోకి చేరుతోంది. ఇప్పటి వరకు 25 కోట్ల క్లబ్ లోనే ఆగిపోయిన సాయి, విన్నర్తో కొత్త రికార్డ్ సృష్టిస్తాడేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement