
Balakrishna-Gopichand Malineni Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మలినేని గోపిచంద్ డైరెక్షన్‌లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నిన్న(ఫిబ్రవరి 18) మొదలైంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘వేటపాలెం’లో జరిగిన ఒక సంఘటన ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను తయారు చేసుకున్నట్టుగా గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: Bheemla Nayak OTT Streaming: కళ్లు చెదిరే డీల్‌కు ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్న 2 సంస్థలు!
అంతేకాదు ఈ కథ కోసం ఆయన 'వేటపాలెం' వెళ్లి అక్కడ పాత న్యూస్ పేపర్ల నుంచి కొంత సమాచారాన్ని సేకరించాడని కూడా తెలిసింది. రాయలసీమ నేపథ్యంలోనే ఆయన ఈ కథను నడిపించనున్నట్టు చెప్పుకున్నారు. అయితే ఈ తాజా బజ్ ప్రకారం నిన్న షూటింగు మొదలైన తరువాత, ఇది ఒక కన్నడ సినిమాకి రీమేక్ అని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ 'మఫ్టీ' అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేశారు.
చదవండి: Manchu Family: ఆ పోస్టులు డిలీట్ చేయకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా..
ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. దీనికి బాలయ్య సినిమా రీమేక్ అని చెప్పుకుంటున్నారు. దీంతో బాలయ్య రీమేక్ సినిమాలో నటిస్తున్నారంటూ ఈ విషయం నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. మరి దర్శకుడు గోపీచంద్ మలినేని దీనిపై ఎలా స్పందిస్తారలో చూడాలి. కాగా రామ్ - లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. కీలకమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment