నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మలినేని గోపిచంద్ డైరెక్షన్‌లో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 'ఎన్బీకే 107' వర్కింగ్ టైటిల్‌తో రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 18న మొదలైంది. అయితే 'అఖండ' చిత్రంతో విశేషంగా ఆకట్టుకున్న బాలయ్య బాబు మరో కొత్త పవర్ఫుల్ అవతారంలో ఆకట్టుకోనున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా సోమవారం ఫిబ్రవరి 21న విడుదల చేసింది.
ఈ ఫొటోలో నందమూరి బాలకృష్ణ లుంగీ ధరించి, బ్లాక్ షేడ్స్ పెట్టుకుని స్టైలిష్ లుక్‌లో అదిరిపోయాడు. ఈ మాస్ లుక్ బాలయ్య అభిమానుల్లో పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జంటగా శ్రుతిహాసన్ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం వేటపాలెంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీ కన్నడ హీరో శివరాజ్ కుమార్ నటించిన మఫ్టీ చిత్రానికి రీమెక్ అని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.
Nandamuri Balakrishna: బాలకృష్ణ కొత్త అవతారం.. స్టైలిష్‌గా మాస్ లుక్
Published Mon, Feb 21 2022 7:45 PM | Last Updated on Mon, Feb 21 2022 8:13 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment