Duniya Vijay’s First Look In debut Telugu Movie: కన్నడ స్టార్ దునియా విజయ్ తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు దునియా విజయ్.
ఈ చిత్రంలో ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా పవర్‌ఫుల్ పాత్ర చేస్తున్నారాయన. ఈ పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘‘హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. బాలకృష్ణ కెరీర్‌లో 107వ చిత్రమిది. హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది’’ అని చిత్రబృందం పేర్కొంది.ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషీ పంజాబీ, సీఈఓ: చిరంజీవి (చెర్రీ), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కేవీవీ.
Comments
Please login to add a commentAdd a comment