కోలీవుడ్ కు జూనియర్ ఎన్టీఆర్ | Junior NTR to Kollywood | Sakshi
Sakshi News home page

కోలీవుడ్ కు జూనియర్ ఎన్టీఆర్

Published Sun, Aug 23 2015 3:08 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

కోలీవుడ్ కు జూనియర్ ఎన్టీఆర్

కోలీవుడ్ కు జూనియర్ ఎన్టీఆర్

తమిళసినిమా: టాలీవుడ్ చిత్రాల స్టామినా పెరి గిం ది. తెలుగు సిని మాల కోసం ఇప్పుడు ప్రపంచ సినిమా ఎదురు చూస్తోంది. ఇది టాలీవుడ్ స్టార్ హీ రోలను కొత్త పుం తలు తొక్కిస్తోంది. కసిని పెంచుతోం ది. దర్శకుల మెదడుకు పదును పెట్టేలా చేస్తోంది. ఇందుకు చిన్న ఉదాహరణ ఇటీవల విడుదలయిన బాహుబలి చిత్రమే.
 
  ఈ చిత్రం అంచనాలను అధిగమించి ఖండాంతరాలను దాటి తెలుగు చిత్రం ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందని చెప్పవచ్చు. ఆ తరువాత తెరపైకొచ్చిన శ్రీమంతుడు అదే బాట పట్టడంతో ఆ చిత్రాల కథానాయకుల సమకాలీన నటుల మైండ్‌సెట్ మారుతోంది. తమ పరిధిని విస్తరించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారనడానికి ఉదాహరణ తెలుగులో స్టార్ హీరోగా వెలుగొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తె లుగుతో పాటు తమిళ చిత్ర పరిశ్రమపై కూడా దృష్టి సారించడం.
 
 ఆయన సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న భారీ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో విడుదల చే యడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు తదుపరి ద్విభాషా చిత్రంలో న టించడానికి రంగం సిద్ధం చేసుకున్నటు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్.మురుగుదాస్ కథ, కథనాలతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న భారీ చిత్రంలో జూని యర్ ఎన్టీఆర్ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు, ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్నట్లు కోలీవుడ్ టాక్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement