జోడీ కుదిరింది! | Rakul Preet Singh to romance Varun Tej | Sakshi
Sakshi News home page

జోడీ కుదిరింది!

Published Fri, Nov 27 2015 11:13 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

జోడీ కుదిరింది!

జోడీ కుదిరింది!

వరుణ్ తేజ్ మంచి దూకుడు మీద ఉన్నాడు. ఒక సినిమా చేస్తున్నప్పుడే ఇంకో సినిమా ఫైనలైజ్ చేసేస్తున్నాడు. ‘కంచె’తో పాటే ‘లోఫర్’ కమిట్ అయ్యాడు. ‘లోఫర్’ డిసెంబర్ 18న విడుదలకు సిద్ధంగా ఉంది. మరి.. వరుణ్ తదుపరి ఏ సినిమా చేయబోతున్నాడు? ఆ విషయానికే వద్దాం. ‘పండగ చేస్కో’తో హిట్ సాధించిన గోపీచంద్ మలినేనికి వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రానికి నిర్మాత. ఇందులో వరుణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనుందని సమాచారం.

వరుణ్ నటించిన తొలి చిత్రం ‘ముకుంద’లో అప్‌కమింగ్ హీరోయిన్ పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ‘కంచె’లో నటించిన ప్రగ్యా జైస్వాల్ కూడా అప్‌కమింగ్ హీరోయినే. మూడో సినిమా ‘లోఫర్’లో దిషా పటాని కూడా అంతే. సో.. నాలుగో సినిమాలో వరుణ్ స్టార్ హీరోయిన్‌తో జతకట్టనున్నాడన్న మాట.

వరుణ్, రకుల్ సరి జోడీ అనొచ్చు. ఎందుకంటే, వరుణ్ మంచి ఎత్తు. రకుల్ కూడా మంచి హైట్. చూడచక్కగా ఉండే ఈ జంట మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని ఊహించవచ్చు. సంక్రాంతి తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement