
నందమూరి బాలకృష్ణ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శనివారం హైదరాబాద్‌లో ఈ మూవీ పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. బాలయ్య కెరీర్‌లో 107వ చిత్రంగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టే గోపిచంద్ మంచి కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది.
గోపీచంద్ బాలయ్యతో కలిసి పని చేయడం కూడా ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ గోపిచంద్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క సారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయన్ని డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో. నా బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ కంటే జీవితకాల బాధ్యతగా భావిస్తున్నాను. జై బాలయ్య’అంటూ ట్వీట్ చేశాడు. వాస్తవ సంఘటనలతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు.
చిన్నప్పుడు నేను చొక్కాలు చించుకుని ఒక్క సారైనా కలవాలని కలలు కన్న నా హీరో. ఇండస్ట్రీకి వచ్చాక ఎలాగైనా ఆయన్ని డైరెక్ట్ చెయ్యాలని టార్గెట్ పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో.
— Gopichandh Malineni (@megopichand) November 13, 2021
నా బాలయ్యతో పని చేసే భాగ్యం కలగడం నా life time achievement కంటే lifetime responsibilityగా భావిస్తూ.జై బాలయ్య pic.twitter.com/6NG75pWQbZ