NBK107 Mass Poster: Balakrishna NBK 107 Special Mass Poster Released on NTR Jayanthi - Sakshi
Sakshi News home page

NBK107 Mass Poster: కత్తి పట్టిన బాలయ్య.. మాస్‌ లుక్‌ అదిరింది!

Published Sat, May 28 2022 11:16 AM | Last Updated on Sat, May 28 2022 11:48 AM

NBK107: Mass Look Poster Release From Balakrishna, Gopichand Malineni Movie - Sakshi

 బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్ర చేస్తున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. నేడు(మే 28)దిగ్గజ నటుడు నందమూరి  తారక రామారావు 100వ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌.

తెలుపు రంగు దుస్తులు ధరించి, చేతిలో ప్రత్యేకమైన కత్తిని పట్టుకొని బాలయ్య యంగ్‌ అండ్‌ డాషింగ్‌గా కనిపిస్తున్నాడు.హై ఇంటెన్స్‌ మాస్, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్‌ దునియా విజయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ‘బాలకృష్ణ కెరీర్‌లో 107వ చిత్రమిది. ఇప్పటి వరకు 40శాతం షూటింగ్‌ పూర్తయింది. ఎక్కడా రాజీపడకుండా భారీ బాడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సరికొత్త లుక్‌లో బాలకృష్ణ కనిపించబోతున్నాడు. టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తాం’అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నాడు.ఈ చిత్రానికి  'జై బాలయ్య' టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement