ఆటాపాటా | Apsara Rani to star in Krack | Sakshi

ఆటాపాటా

Published Sat, Oct 17 2020 12:44 AM | Last Updated on Sat, Oct 17 2020 12:44 AM

Apsara Rani to star in Krack - Sakshi

‘డాన్‌ శీను, బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘క్రాక్‌’. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజ¯Œ  పతాకంపై బి. మధు నిర్మిస్తున్నారు. శ్రుతీహాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అప్సరా రాణి ప్రత్యేక పాట చేస్తున్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. షూటింగ్‌ ముగింపు దశలో ఉంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్లో రవితేజ, అప్సరా రాణిపై ఒక ఐటమ్‌ సాంగ్‌ చిత్రీకరిస్తున్నాం. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ మాస్‌ సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రాశారు. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జి.కె. విష్ణు, సహనిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement