
మాస్ మహారాజ్ రవితేజ, గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ‘క్రాక్’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నూతన సంవత్సరం పురస్కరించుకొని ‘క్రాక్’ ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ రవితేజ స్టైల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. ‘శంకర్... పోతరాజు వీరశంకర్, ఒంగోలు నడి సెంటర్‌లో నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడకా.., శంకర్.. ష్యూర్ షాట్.. నో డౌట్.. పుచ్చె పేలిపోద్ది అంటూ రవితేజ చెప్పిన మాస్ డైలాగ్స్ ఆడియన్స్‌ని ఈలలు వేయించేలా ఉన్నాయి.
మరోవైపు ‘చూశారా.. జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కి తాట తీశాయ్.. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే.. ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే ఒక పోలీసోడూ..’ అంటూ ట్రైలర్ ఆరంభంలో విక్టరీ వెంకటేశ్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అదిరిపోయింది. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ విలన్ పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతం అందించాడు.
‘క్రాక్’కి వాయిస్ ఓవర్ ఇచ్చారు విక్టరీ వెంకటేశ్. ఇలా వేరే హీరోల సినిమాలకు ఆయన మాట ఇవ్వడం ఇది మొదటిసారేం కాదు. నితిన్ ‘శ్రీనివాస కల్యాణం’కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే ఇంగ్లిష్ సినిమా ‘అల్లావుద్దీన్’ తెలుగు వెర్షన్‌లో జీనీ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. తాజా ‘క్రాక్’కి కూడా చెప్పారు. ఇక సినిమాను జనవరి 14న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్రబృందం.. తాజాగా విడుదల తేదిని మార్చింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment