Raviteja And Sree Leela New Movie With Gopichand Malineni, Deets Inside - Sakshi
Sakshi News home page

Raviteja - Sree Leela: రవితేజతో శ్రీలీల మరోసారి.. ఆ సినిమా కోసమే!

Published Mon, Jun 19 2023 3:14 PM | Last Updated on Mon, Jun 19 2023 3:53 PM

Raviteja Sree Leela Gopichand Malineni New Movie - Sakshi

మాస్ మహారాజ రవితేజ 'ధమాకా' మూవీ పేరు చెప్పగానే అందరికీ హీరోయిన్ శ్రీలీలనే గుర్తొస్తుంది. ఇందులో వేరే లెవల్ ఎనర్జీతో డ్యాన్సులేసింది. సినిమాలో కొన్నిచోట్ల హీరోని డామినేట్ కూడా చేసింది. స్టోరీ పరంగా ఈ సినిమాలో కొత్తగా ఏం లేకపోయినా శ్రీలీల వల్ల ఓ ఫ్రెష్ నెస్ వచ్చి, హిట్ అయిందని కూడా చెప్పొచ్చు. అలాంటిది రవితేజతో శ్రీలీల మరోసారి కలిసి రచ్చ చేసేందుకు సిద్ధమైపోయిందట.

తెలుగులో ఈ మధ్య కాలంలో శ్రీలీలకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి రాలేదు. ఎందుకంటే ఈ బ్యూటీ చేతిలో ఏకంగా తొమ్మిది వరకు కొత్త మూవీస్ ఉన్నాయి. గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్ సింగ్, ఆదికేశవ.. ఇలా బోలెడన్నీ సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో కొత్త చిత్రం వచ్చినట్లు తెలుస్తోంది. అదే రవితేజ-గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్.

'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న రవితేజ-గోపీచంద్ మలినేని.. ఇప్పుడు మరో సినిమా కోసం కలిసి పనిచేయబోతున్నారు. 'వీరసింహారెడ్డి' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న గోపీచంద్.. రవితేజకు ఓ కథ చెప్పి ఒప్పించారట. ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా అనే చర్చ వచ్చినప్పుడు శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. దాదాపు కన్ఫర్మ్ కూడా అయిపోయిందట. అధికారిక ప్రకటన ఇంకా మిగిలుందట. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీలోకి 22 సినిమాలు.. ఆ ఒక్కటి మాత్రం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement