
నటి శ్రుతీ హాసన్... స్టార్ హీరో కూతురిగా కంటే సొంత టాలెంట్‌తోనే చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా గాయనిగా, డ్యాన్సర్‌గా సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా విభిన్న కోణాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శ్రుతీహాసన్. తెలుగులో చివరగా పవన్ కల్యాణ్‌తో కలిసి కాటమ రాయుడు సినియాలో నటించిన శ్రుతి.. మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తుండగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నారు. చదవండి: వకీల్ సాబ్ సెట్‌లో అడుగుపెట్టనున్న శృతి
ఇక ఈ సినిమా షూటింగ్ కొంత వరకు మినహా మొత్తం పూర్తయ్యింది. మిగిలిన పాటల భాగాన్ని షూట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలో తన క్రాక్ సినిమా డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో కలిసి శ్రుతీ హాసన్ స్టెప్పులు వేశారు. మిర్రర్ ముందు మ్యూజిక్ పెట్టి సెల్ఫీ వీడియో తీస్తున్న శ్రుతి హాసన్ కాలు కదిపి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. దీన్ని చూసిన గోపిచంద్ ముందుగా డ్యాన్స్ చేసేందుకు బిడియంగా ఫీల్ అయ్యారు. అయినప్పటికీ మెల్లమెల్లగా డైరెక్టర్‌తో కూడా శ్రుతీ డ్యాన్స్ చేయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఎప్పుడూ రోల్.. కెమెరా..యాక్షన్ అంటూ బిజీగా ఉండే డైరెక్టర్ ఇలా డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఒకింతా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మానసిక ఆందోళనతో బాధపడ్డా: శ్రుతీహాసన్
Comments
Please login to add a commentAdd a comment