
మాస్ మహారాజ రవితేజ, బ్యూటీ శృతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘క్రాక్’. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బి. మధు నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకోబోతుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్ ఫోస్టర్‌కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూవీ టీజర్‌ను చిత్ర బృందం విడుదలచేసింది.
‘ఒంగోలులో రాత్రి 8గంటలకు కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’అంటూ మొదలైన టీజర్ ఆద్యంతం యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకుంది. అంతేకాకుండా మధ్యలో శృతిహాసన్‌తో రవితేజ లవ్ సీన్లు హైలైట్‌గా నిలిచాయి. ‘ఒరేయ్ అప్పిగా సుప్పిగా నువ్వెడైతేనాకేంట్రా నా డొప్పిగా’అంటూ రవితేజ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. పోలీస్ గెటప్‌లో రవితేజ ‘విక్రమార్కుడు’ను గుర్తుచేస్తున్నాడు. అన్ని వర్గాలను ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను ఈ టీజర్ తెగ ఆకట్టుకుంటోంది.
దీంతో ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే రెండు మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ‘డాన్ శీను, బలుపు’ తర్వాత వస్తున్న మూడో చిత్రం ‘క్రాక్’ భారీ అంచనాలే ఉన్న విషయం తెలిసిందే. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. మే8న ఈ చిత్రం విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment