చిరంజీవి ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌..‘సంక్రాంతి’కి వచ్చేస్తున్నాడు | Chiranjeevi, Shruti Haasan starrer Mega154 locks Sankranti 2023 | Sakshi
Sakshi News home page

చిరంజీవి ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌..‘సంక్రాంతి’కి వచ్చేస్తున్నాడు

Published Sat, Jun 25 2022 5:13 AM | Last Updated on Sat, Jun 25 2022 1:04 PM

Chiranjeevi, Shruti Haasan starrer Mega154 locks Sankranti 2023 - Sakshi

చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో ఓ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ 40 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా ‘కలుద్దాం సంక్రాంతికి.. జనవరి 2023’ అంటూ శుక్రవారం పోస్టర్‌ ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్‌.

‘‘మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. చిరంజీవిని గతంలో చూడని మాస్‌ అప్పీలింగ్, పవర్‌ ప్యాక్‌ పాత్రలో చూపించబోతున్నారు బాబీ. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్‌ను జూలైలో ప్రారంభిస్తాం’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆర్థర్‌ ఎ విల్సన్, సహనిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్‌ ఎం, సీఈవో: చెర్రీ, లైన్‌ ప్రొడ్యూసర్‌: బాలసుబ్రహ్మణ్యం కేవీవీ.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement