ఓటీటీకి లాభం రాదు | Vijay Sethupathi next film Laabam will have a theatrical release | Sakshi
Sakshi News home page

ఓటీటీకి లాభం రాదు

Published Thu, Dec 10 2020 6:31 AM | Last Updated on Thu, Dec 10 2020 6:31 AM

Vijay Sethupathi next film Laabam will have a theatrical release - Sakshi

విజయ్‌ సేతుపతి, శ్రుతీ హాసన్‌

విజయ్‌ సేతుపతి, శ్రుతీహాసన్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘లాభం’. సామాజిక అంశాలను చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. ఈ చిత్రం థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కొట్టిపారేసింది చిత్రబృందం. ‘‘లాభం’ సినిమా ఓటీటీలో విడుదల అవ్వదు. ముందు థియేటర్స్‌లోనే విడుదలవుతుంది’’ అన్నారు నటుడు విజయ్‌ సేతుపతి. రెండేళ్ల విరామం తర్వాత శ్రుతీహాసన్‌ చేసిన తమిళ చిత్రం ఇది. ఇందులో ఆమె జర్నలిస్ట్‌ పాత్రలో కనిపిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement