![Parthiban, Aditi Rao Hydari roped in for Tughlak Darbar - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/3/Aditi-Rao.jpg.webp?itok=2tQOff77)
అదితీ రావ్ హైదరీ
రాజకీయ నాయకుడిగా మారనున్నారు విజయ్ సేతుపతి. ఆయనకు తోడుగా అదితీ రావ్ హైదరీ కూడా జాయిన్ అయ్యారని తెలిసింది. మరి రాజకీయాల్లో వీళ్ల లక్ష్యం ఏంటో స్క్రీన్‌పైనే చూడాలి. విజయ్ సేతుపతి హీరోగా నూతన దర్శకుడు ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ తెరకెక్కించనున్న తమిళ చిత్రం ‘తుగ్లక్ దర్బార్’. పొలిటికల్ ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అదితీ రావ్ హీరోయిన్‌గా నటించనున్నారని చిత్రబృందం ప్రకటించింది. పార్తిబన్ విలన్‌గా నటించనున్నారు. ఇదివరకు మణిరత్నం తీసిన ‘నవాబ్’లో విజయ్ సేతుపతి, అదితీ రావ్ నటించారు. జోడీగా నటించడం మాత్రం ఇదే తొలిసారి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment