హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు | Director Parthiban Praises Hero Surya Over OTT Decision | Sakshi
Sakshi News home page

సూర్యకు పార్తీబన్‌ ప్రశంసలు 

Published Tue, May 19 2020 8:49 AM | Last Updated on Tue, May 19 2020 9:12 AM

Director Parthiban Praises Hero Surya Over OTT Decision - Sakshi

సాక్షి, చెన్నై : హీరో సూర్యను దర్శక, నటుడు పార్తీబన్‌ ప్రశంసించారు. సూర్య తన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆయన భార్య జ్యోతికను ప్రధాన పాత్రలో నటింపజేస్తూ నిర్మించిన చిత్రం పొన్‌మగల్‌ వందాల్‌. ఇందులో దర్శకుడు కె.భాగ్యరాజ్, పార్తీబన్, పాండ్యరాజన్‌ త్యాగరాజన్‌ ముఖ్య పాత్రలను పోషించారు. నవ దర్శకుడు పెట్రిక్‌ తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కాగా, లాక్‌డౌన్‌ కారణంగా చిత్రాల విడుదల నిలిచిపోవడంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు సూర్య ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. పొన్‌ మగల్‌ వందాల్‌ చిత్రాని ఓటీటీలో ప్రసారం చేయడానికి నిర్ణయించుకున్నారు. దీంతో ఆయనపై థియేటర్ల యాజమాన్య తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. ( జ్యోతిక వ్యాఖ్యలను సమర్థించిన సూర్య.. )

అయినా కానీ, సూర్య చిత్రాన్ని ఈ నెల 29వ తేదిన అమెజాన్‌ ప్రైమ్‌ టైమ్‌లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా పార్తీబన్, సూర్యను ప్రశంసిస్తూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ధైర్యం పురుష లక్షణమని, ఒక ధైర్య లక్ష్మి.. భర్త తన సహధర్మచారిణి ప్రేమను, ఆమె గౌరవాన్ని కాపాడటానికి  వేసిన అడుగును వెనక్కు తీసుకోలేదన్నారు. అలా, తన వీరత్వాన్ని ప్రదర్శిస్తూ పొన్‌మగళ్‌ వందాల్‌ చిత్రాన్ని ఓటీటీ ద్వారా ప్రసారం చేయడాన్ని ప్రశంసించారు. ఆ చిత్ర దర్శకుడు పెట్రిక్, యూనిట్‌ సభ్యులకు పార్తీబన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement