
చెన్నై: నటుడు పార్థిబన్, నటి సీతల పెద్ద కూతురు అభినయ పెళ్లి ఆదివారం ఉదయం చెన్నైలో ఘనంగా జరిగింది. అభినయకు నటుడు ఎంఆర్.రాధ కొడుకు ఎంఆర్‌ఆర్.వాసు కూతురు సత్య జయచిత్ర కొడుకు నరేష్ కార్తీక్‌తో నిన్న (ఆదివారం) ఉదయం స్థానిక అడయారులోని లీలా ప్యాలెస్‌లో వేదమత్రాల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి నవ వధూవరులను ఆశీర్వదించారు. పార్థిబన్, సీతల రెండవ కూతురు కీర్తన పెళ్లి ఇంతకు ముందే జరిగిన విషయం విదితమే.
ఈ వేడుకకు ఎంఆర్.రాధ కటుంబానికి చెందిన నటుడు రాధారవి, లతా రజనీకాంత్, నిర్మాత ఆర్‌బీ.చౌదరి, దర్శకుడు ఏఎస్‌ఏ.చంద్రశేఖర్, శోభ దంపతులు,కే.భాగ్యరాజ్, పూర్ణిమా భాగ్యరాజ్ దంపతులు, శాంతను, కీర్తి దంపతులు, దర్శకుడు కేఎస్.రవికుమార్, పాండియరాజన్, ఎళిల్, విక్రమన్, తంగర్‌బచ్చన్, నటుడు శివకుమార్, కార్తీ, సూరి, పృథ్వీరాజన్, మయిల్‌సామి, మోహన్, చిత్రాలక్ష్మణన్, నిర్మాత ఐçక్. హరి, లేనా తమిళ్‌వానన్, చిత్రకారుడు ఏపీ.శ్రీధర్, మాణిక్య నారాయణన్, నటి ఈశ్వరిరావు, డీటీఆర్.రాజా, రాధిక శరత్‌కుమార్, నిరోషా, ప్రముఖ నటీమణులు శారద, రాజశ్రీ, సచ్చు, వెన్నిరాడై నిర్మల భానుప్రియ, జేఎస్‌కే.సతీశ్, వ్యాపారవేత్త నల్లికుప్పస్వామి శెట్టియార్, అడ్వకేట్ రాజశేఖర్, నిర్మాత సత్యజ్యోతి త్యాగరాజన్, ఛాయాగ్రాహకుడు సుకుమార్ విచ్చేసి వధూవరులను ఆశీర‍్వదించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)