రిక్షాలో వెళ్తూ ప్రముఖ నటి తల్లి కన్నుమూత | Actress MG Abhinaya Mother Passed Away | Sakshi
Sakshi News home page

Mg Abhinaya: ప్రముఖ నటి ఇంట్లో విషాదం.. ఎమోషనల్ పోస్ట్

Published Sat, Aug 31 2024 9:17 PM | Last Updated on Sat, Aug 31 2024 9:18 PM

Actress MG Abhinaya Mother Passed Away

ప్రముఖ నటి అభినయ ఇంట్లో విషాదం. ఆమె తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. రిక్షాలో బయటకెళ్లిన ఆమె.. ఊహించని విధంగా కన్నుమూసింది. ఈ విషయాన్ని స్వయంగా సదరు నటి వెల్లడించింది. ఆగస్టు 17న ఇదంతా జరిగినట్లు అభినయ చెప్పింది. ఇన్ స్టాలో తల్లిని తలుచుకుని చాలా పెద్ద పోస్ట్ పెట్టి ఎమోషనల్ అయిపోయింది.

(ఇదీ చదవండి: 'పుష్ప 2' ఓటీటీ హక్కులు.. ఏకంగా వందల కోట్లు?)

తమిళనాడుకు చెందిన అభినయకు పుట్టుకతోనే బధిర. అంటే మాట్లాడలేదు, వినపడదు. అయినా సరే సినిమాల్లో నటిస్తోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో మహేశ్-వెంకటేశ్‌కి చెల్లిగా నటించి బోలెడంత ఫేమ్ తెచ్చుకుంది. వీటితో పాటు నేనింతే, కింగ్, శంభో శివ శంభో, దమ్ము, ఢమరుకం, ధృవ, రాజుగారి గది 2, సీతారామం, గామి, ద ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది.

'అమ్మ నువ్వు లేవనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇలా సడన్‌గా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతావనుకోలేదు. తాతలానే నువ్వు కూడా ఇలా రిక్షాలోనే చనిపోయావు. తండ్రి-కూతురు ఇలా ఒకేలా మరణించడం ఎంత యాద్ధృచ్చికమో కదా! నువ్వు లేకపోతే నేను ఇంత సాధించేదాన్ని కాదు. ప్రతిచోట నన్ను సపోర్ట్ చేస్తూ అండగా నిలబడ్డావ్. ఇప్పుడు నీ బాధ్యతని సాయిసునందన్ తీసుకుంటాడు. జన్మంటూ ఉంటే మళ్లీ మళ్లీ నీ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నా అమ్మ. రెస్ట్ ఫరెవర్ అమ్మ' అని భావోద్వేగంతో అభినయ రాసుకొచ్చింది.

(ఇదీ చదవండి: అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement