
ప్రయోగాత్మకమైన చిత్రాలకు పెట్టింది పేరు విక్రమ్ చియాన్. ప్రతి చిత్రంలోనూ విభిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అబ్బురపరుస్తుంటాడు. అందుకే తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగులోనూ ఆయనకు మంచి డిమాండ్ ఉంది. విక్రమ్ తాజాగా నటించిన చిత్రం ‘కోబ్రా’. దాదాపు మూడేళ్ల తర్వాత థియేటర్స్‌లో విడుదలవుతున్న విక్రమ్ సినిమా ఇది. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఆగస్ట్ 31న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘కోబ్రా’లో నటించడానికి విక్రమ్ భారీ మొత్తంలో పారితోషికాన్ని పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం కోబ్రా సినిమాకు విక్రమ్ దాదాపు 25కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను తీసుకున్నాడట. ఈ రెమ్యూనరేషన్ సినిమా బడ్జెట్‌లో దాదాపుగా 22 శాతమట.
(చదవండి: రూ.9 కోట్ల భారీ ఆఫర్.. అయినా ఆ యాడ్‌కు నో చెప్పిన హీరో)
ఈ చిత్రంలో విక్రమ్ 10 గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. అందుకోసం విక్రమ్ చలా శ్రమించాల్సి వచ్చిందట. అందుకే నిర్మాత అంతమొత్తంలో చెల్లించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక కోబ్రా సినిమా విషయానికొస్తే.. యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది.