![Manjummel Boys Director Chidambaram to Direct Chiyaan Vikram - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/7/manjummel-boys-director.jpg.webp?itok=pDixo6qc)
మంజుమ్మల్ బాయ్స్.. ఈ మధ్యకాలంలో మారుమోగిపోతున్న మలయాళ చిత్రం. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కేరళలోనే కాకుండా తమిళనాడులోనూ అనూహ్య విజయాన్ని సాధించింది. తెలుగులోనూ డబ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతటి సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాకు చిదంబరం దర్శకుడిగా వ్యవహరించాడు. డైరెక్టర్‌గా ఇది ఈయనకు రెండో సినిమా!
చిదంబరానికి ప్రశంసలు
కోలీవుడ్‌లో కమల్ హాసన్, రజనీకాంత్, విక్రమ్, ధనుష్‌ల నుంచి పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలను పొందారీయన. ఈయన దర్శకత్వంలో చిత్రాలు చేయడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపుతున్నారు. హీరో ధనుష్ కూడా చిదంబరం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయినట్లు ప్రచారం జరిగింది. అయితే కాల్‌షీట్స్ సమస్య కారణంగా ఆయన నటించలేకపోయినట్లు సమాచారం.
విక్రమ్‌తో మూవీ
తాజాగా చియాన్ విక్రమ్ దర్శకుడు చిదంబరం డైరెక్షన్‌లో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు దర్శకుడు విక్రమ్‌ను కలిసి చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం తంగలాన్ చిత్రాన్ని పూర్తి చేసిన విక్రమ్ తన 62వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తర్వాత దర్శకుడు చిదంబరం దర్శకత్వంలో విక్రమ్ నటించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
చదవండి: అర్థరాత్రి నడి రోడ్డుపై ఐస్‌క్రీమ్ తింటూ చిల్ అవుతున్న నయన్.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment