Director AR Murugadoss Upcoming Movie With Vikram Chiyaan, Deets Inside - Sakshi
Sakshi News home page

AR Murugadoss: ఒకప్పుడు స్టార్‌ డైరెక్టర్‌.. ఇప్పుడు ఏ హీరో డేట్స్‌ దొరకడం లేదు!

Published Thu, Apr 21 2022 12:53 PM | Last Updated on Thu, Apr 21 2022 1:23 PM

Director AR Murugadoss Next Film With Vikram Chiyaan - Sakshi

ఒకప్పుడు  సౌత్ లోనే టాప్ డైరెక్టర్ మురుగదాస్.ఆ మాటకు వస్తే బాలీవుడ్ లోనూ అతని పేరు  బాగా వినిపించింది. సోషల్ ఇష్యూస్ ను తనదైన పంధా డీల్ చేస్తూ, మురుగదాస్ తీసే సినిమాలు అతన్ని ప్రత్యేకమైన దర్శకుడిగా నిలబెట్టాయి.కాని ఇదంతా గతం.ఇప్పుడు మురుగదాస్ చేతిలో సినిమాలే లేవు. రెండేళ్ల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తెరకెక్కించిన దర్బార్‌  ప్లాఫ్ అవ్వడంతో మురుగదాస్‌కు అవకాశాలు దగ్గాయి. ఇతనితో సినిమాలు చేసేందుకుహీరోలెవరూ ముందుకు రావడం లేదట.

దర్బార్ తర్వాత విజయ్ తో సినిమా తీయాల్సింది. కానీ  దర్బార్ రిజల్ట్ చూసిన తర్వాత విజయ్ ఈ డైరెక్టర్ ను దూరం పెట్టాడు. దాంతో మురగదాస్ ఆ తర్వాత బన్ని కోసం స్టోరీ రాస్తున్నాడని టాక్ వినిపిచింది. కాని ఐకాన్ స్టార్ పుష్ప సిరీస్ తో బిజీ కావడంతో ఇప్పుడు మురుగదాస్ మరో హీరో డేట్స్ కోసం ట్రై చేయడం మొదలుపెట్టాడు.

రెండేళ్ల తర్వాత మురగదాస్ ను నమ్మి సినిమా చేసేందుకు ఓ స్టార్ హీరో డేట్స్ ఇచ్చాడట. ఆ హీరో మరెవరోకాదు చియాన్‌  విక్రమ్. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాను నిర్మించేందుకు సన్ పిక్చర్స్ ప్రయత్నిస్తోందట. రీసెంట్ గా ప్రైమ్ లో రిలీజైన మహాన్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు చియాన్.మురుగదాస్ మూవీతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అందుకోవాలనుకుంటున్నాడట.ఈ చిత్రంతోనైనా మురుగదాస్ గతవైభవాన్ని అందుకుంటాడా లేదా అన్నది చూడాల్సి ఉంది.
(చదవండి: జోరు మీదున్న హీరోలు, రీమేక్‌ అంటే మరింత హుషారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement