Not Rashmika Mandanna, Malavika Mohanan In Chiyaan Vikram Next Film - Sakshi
Sakshi News home page

Malavika Mohanan : రష్మిక కాదు.. ఆమె ప్లేస్‌లో ఛాన్స్‌ కొట్టేసిన మాళవిక

Published Tue, Oct 18 2022 1:39 PM | Last Updated on Tue, Oct 18 2022 2:28 PM

Not Rashmika Mandanna Malavika Mohanan In Chiyaan Vikram Next - Sakshi

తమిళ సినిమా: ఒకరు జారవిడుచుకుంటే మరొకరు దాన్ని అందిపుచ్చుకుంటారు. నటి మాళవిక విషయంలో ఇదే జరిగింది. ఈ మలయాళీ బ్యూటీ మాతృభాషతో పాటు, తమిళం, తెలుగు, హిందీ తదితర భాషల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ఇండియన్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రజనీకాంత్‌ నటించిన పేట చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మాళవిక మోహన్‌ ఆ తర్వాత విజయ్‌ జంటగా మాస్టర్, ధనుష్‌ సరసన మారన్‌ చిత్రాల్లో నటించే అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో ముద్ర అనే చిత్రంలో నటిస్తోంది.

కాగా తాజాగా కోలీవుడ్‌లో మరో లక్కీ ఛాన్స్‌ ఈమెను వరించింది. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్ర విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న చియాన్‌ విక్రమ్‌ తాజాగా తన 61వ చిత్రానికి సిద్ధమైపోయారు. దీనికి పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియోస్‌ గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటి రష్మిక మందన్నా నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రంలో ఆమె నటించడం లేదని తెలిసింది.

ఆమెకు బదులుగా నటి మాళవిక మోహన్‌ను ఎంపిక చేసినట్టు చిత్ర వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఆమె ఇందులో నటించడం ఖాయమని తెలుస్తోంది. రష్మికకు దక్కాల్సిన అవకాశం మాళవిక మోహన్‌ను వరింంది. కాగా ఇంతకుముందు ఈమె తమిళంలో నటింన పేట చిత్రంలో మం మార్కులు తెచ్చుకుంది. మాస్టర్‌ చిత్రం హిట్‌ అయినా అందులో మాళవిక మోహన్‌ పాత్ర పరిమితమే. ఇక ధనుష్‌తో జతకట్టిన మారన్‌ చిత్రం ఓటీటీలో విడుదలతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే దర్శకుడు పా.రంజిత్‌ చిత్రాల్లో కథానాయక పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. మరి విక్రమ్‌తో నటిస్తున్న ఈ చిత్రంతో మాళవిక మోహన్‌కు క్రేజ్‌ వస్తుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement