
విభిన్న సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో విక్రమ్ కచ్చితంగా ఉంటాడు. హిట్టా ఫ్లాప్ అనేది పక్కనబెడితే ప్రయోగాలు చేయడం మాత్రం ఆపడు. అలా గతేడాది 'కోబ్రా' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. కానీ హిట్ అనిపించుకోలకపోయింది. అయితేనేం ఈ చిత్రం దర్శకుడితో మరోసారి కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. మొత్తంగా 33 రిలీజ్!)
గతంలో 'డిమాంటీ కాలనీ', 'ఇమైకా నోడిగల్' లాంటి సినిమాలు తీసిన అజయ్ జ్ఞానముత్తు.. 'కోబ్రా' తీశారు. కాగా విక్రమ్ తన 63వ చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టుకే అజయ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. అయితే కోబ్రా చిత్రం చేదు అనుభవాన్ని మరచి పోలేని విక్రమ్ అభిమానులు మళ్లీ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలోనా? అంటూ పెదవి విరుస్తున్నారు. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.
(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా)
Comments
Please login to add a commentAdd a comment