విక్రమ్ నటుడిగా 32 వసంతాలను పూర్తి చేసుకున్నారు. నిరంతర శ్రమ, కృషి, పట్టుదలే ఈయన ఆయుధాలు. పాత్రకు జీవం పోయడం కోసం ఎంతవరకైనా వెళ్తారనే పేరు సంపాదించుకున్నారు. స్వశక్తితో నటుడుగా ఎదిగారు. అయితే ఆరంభంలో విజయాలు ఈయనకి అందని ద్రాక్షగా మారాయి. అయినా నిరాశ పడకుండా 1990లో నట పయనాన్ని ప్రారంభించారు. ఎన్ కాదల్ కమ్మని ఈయన తొలి చిత్రం. ఆ తర్వాత పలు చిత్రాలు చేశారు.
చదవండి: ‘బ్రహ్మాస్త్ర’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..
అందులో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ చిత్రాలు ఉన్నాయి. కాగా విక్రమ్ విజయం సాధించిన తొలి చిత్రం సేతు. అందులో ఈయన నటనకు సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత విక్రమ్‌కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. ప్రముఖ దర్శక నిర్మాతలు ఆయనపై దృష్టి పెట్టారు. అలా నటుడిగా 32 వసంతాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ పయనంలో ఆయన ఎన్నో మజిలీలు, విజయాలు చవి చూశారు.
చదవండి: సుకుమార్-దేవిశ్రీ మధ్య రెమ్యునరేషన్ చిచ్చు! అసలేం జరిగింది?
దీని గురించి ఆయన ట్విట్టర్లో అభిమానులను ఉద్దేశించి పేర్కొంటూ.. “ఈ 32 సంవత్సరాలు.. పలు కలలు, ప్రయత్నాల ఉత్సవంగా చెప్పవచ్చు. మీరు లేకపోతే ఇవన్నీ ఉత్త ప్రయత్నాలు, కలలుగానే మిగిలేవి. ఈ 32 ఏళ్లకు కృతజ్ఞతలు’’ అంటూ తమిళంలో ట్వీట్ చేశారు. ఇక ఇప్పటి వరకు విక్రమ్ 60 చిత్రాలు చేశారు. కాగా విక్రమ్ 32 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేయడంతో ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు. దాన్ని “32 ఇయర్స్ ఆఫ్ విక్రమ్’’ అనే పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కాగా విక్రమ్ తాజాగా తన 61వ చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు.
இத்தனை வருடங்கள். அத்தனை கனவுகள். முயற்சி திருவினை ஆக்கும் என்பார்கள். நீங்கள் இல்லையெனில் அது வெரும் முயற்சி மட்டுமே. 💛 இந்த 32 வருடத்துக்கு நன்றி. & Abhinandan KK. Thank you for your lovely edit. pic.twitter.com/fv2Pz56IUL
— Aditha Karikalan (@chiyaan) October 17, 2022
Comments
Please login to add a commentAdd a comment