
స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది.
Ponniyin Selvan Part 1 Teaser Released: స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. ఈ చిత్రం పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి 1955లో రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇందులో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1' తెలుగు టీజర్ సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేయగా, హిందీలో అమితాబ్ బచ్చన్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి రిలీజ్ చేశారు. టీజర్‌లో పోరాట ఘట్టాలు, నటీనటుల నటన ఆకట్టుకుంది. 'ఈ కల్లు, పాట, రక్తం, యుద్ధం అంతా దాన్ని మర్చిపోడానికే. ఆమెను మర్చిపోడానికి, నన్ను నేను మర్చిపోడానికి' అంటూ విక్రమ్ చెప్పే డైలాగ్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్. రెహమాన్ సంగీతం అందించనున్నారు. 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1' మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
From one of my favourite directors... #ManiRatnam sir! Thrilled to launch the Telugu teaser of #PonniyinSelvan1. Really looking forward to the film!https://t.co/Vepx93uY1z
— Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2022