పొన్నియిన్‌ సెల్వన్‌: చోళులు వచ్చేస్తున్నారు | Ponniyin Selvan: Part 1 Teaser Out | Sakshi
Sakshi News home page

Ponniyin Selvan: Part 1: చోళులు వచ్చేస్తున్నారు అంటూ పోస్టర్‌ రిలీజ్‌

Published Sat, Jul 2 2022 5:19 PM | Last Updated on Sat, Jul 2 2022 5:24 PM

Ponniyin Selvan: Part 1 Teaser Out - Sakshi

మణిరత్నం సినిమా వస్తుందంటే చాలు సినీప్రియుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. వారి అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు తెరకెక్కిస్తుంటాడీ డైరెక్టర్‌. ప్రస్తుతం ఆయన పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా చేస్తున్నాడు. విక్రమ్‌, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ రెండు విభాగాలుగా తెరకెక్కనుంది.

తాజాగా శనివారం నాడు ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ రిలీజైంది. చోళులు వస్తున్నారు అంటూ ఈ వీడియోలో రాసుకొచ్చారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో కలిసి మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై మ‌ణిర‌త్నం నిర్మించిన ఈ ఫస్ట్‌ పార్ట్‌ సెప్టెంబర్‌ 30న విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

చదవండి: అందుకే పెళ్లి చేసుకోలేదు.. నా పిల్లలు కారణం కాదు: స్టార్‌ హీరోయిన్‌
జనవరి టు జూన్.. ఫస్టాఫ్‌లో అదరగొట్టిన, అట్టర్‌ ఫ్లాప్‌ అయిన చిత్రాలివే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement