
పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా రూపొందిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి ప్రధాన తారలుగా నటించారు.
ఈ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటిస్తున్నట్లుగా చిత్రబృందం ప్రకటించింది. అలాగే ‘చోళ కీరట రాజు. భయంకరమైన యుద్ధవీరుడు, ది వైల్డ్ టైగర్’ అంటూ విక్రమ్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇక ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోని తొలి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. శరత్‌కుమార్, ప్రభు, పార్తిబన్, ప్రకాశ్‌రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.
Comments
Please login to add a commentAdd a comment