ఈ నెలాఖర్లో థియేటర్స్‌కు వస్తున్నాడు ‘కోబ్రా’. విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రం ‘కోబ్రా’. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. మంగళవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలియజేసింది.
తెలుగులో ‘కోబ్రా’ చిత్రం హక్కులను నిర్మాత ఎన్వీ ప్రసాద్ దక్కించుకున్నారు. ‘‘ఈ చిత్రంలో గణిత మేథావి పాత్రలో విక్రమ్ కనిపిస్తారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఓ కీలక పాత్ర పోషించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్.
Comments
Please login to add a commentAdd a comment