Cobra Teaser: Chiyaan Vikram Cobra Telugu Teaser Out - Sakshi
Sakshi News home page

Chiyaan Vikram: విభిన్న పాత్రల్లో విక్రమ్‌.. ఆసక్తిగా ‘కోబ్రా’ టీజర్‌

Published Tue, Aug 23 2022 9:10 PM | Last Updated on Wed, Aug 24 2022 7:19 AM

Cobra Teaser: Chiyaan Vikram Cobra Telugu Teaser Out - Sakshi

చియాన్‌ విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఎస్‌ఎస్‌ లలిత్‌ కుమార్‌ నిర్మించిన చిత్రం ‘కోబ్రా’. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 31న థియేటర్లోకి రాబోతోంది. ఇక ప్రమోషన్స్‌ పోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను రిలీజ్‌ చేసంది. ఇందులో ‘కోబ్రా.. లెక్కలతో నేరాలను చాలా తేలికగా చేస్తున్నాడు’ అనే డైలాగ్‌ ఆసక్తిగా ఉంది. ఈ ఇందులో చియాన్‌ విభిన్న పాత్రల్లో కనిపించి మరోసారి ఫ్యాన్స్‌ ఫిదా చేయబోతున్నాడు. 

చదవండి: పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్‌ఫ్రెండ్‌ కావాలి: సురేఖ వాణి షాకింగ్‌ కామెంట్స్‌

ఇక ఇందులో క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పలు కీలక సన్నివేశాల్లో కనిపించాడు. ఇక టీజర్‌ చూస్తుంటే లెక్కల మాస్టర్‌గా కోబ్రా అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ కథ అని అర్థమవుతోంది. 7 స్క్రీన్‌ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని, రవి, కేఎస్‌ రవికుమార్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ముఖ్యపాత్రలో సందడి చేయనున్నారు. ఈ సినిమాకు ఎఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. 

చదవండి: లైగర్‌ మూవీ ఫ్లాప్‌ అయితే? విలెకరి ప్రశ్నకు విజయ్‌ షాకింగ్‌ రియాక్షన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement