Chiyaan Vikram Funny Reaction On Boycott Bollywood Issue, Deets Inside - Sakshi
Sakshi News home page

Chiyaan Vikram: బాయ్‌ తెలుసు.. గర్ల్‌ తెలుసు.. కానీ ఆ పదం నాకు తెలియదు: విక్రమ్‌ చియాన్‌

Published Sun, Aug 28 2022 5:24 PM | Last Updated on Sun, Aug 28 2022 5:37 PM

Chiyaan Vikram Reacts On Boycott Bollywood Issue - Sakshi

బాలీవుడ్‌లో బాయ్‌కాట్‌ ట్రెండింగ్‌ నడుస్తోంది.బాలీవుడ్ స్టార్స్ ని, బాలీవుడ్ సినిమాలని వరుసపెట్టి బాయ్‌కాట్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల ఆమిర్‌ ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చడ్డా’, అక్షయ్‌ కుమార్‌ ‘రక్షా బంధన్‌’, తాప్సీ ‘దొబారా’చిత్రాలకు ఈ బాయ్‌కాట్‌ సెగ తగిలింది. గత గురువారం(ఆగస్ట్‌ 25) విడుదలైన ‘లైగర్‌’ని బహిష్కరించాలంటూ #BoycottLigerఅనే ‍హ్యాష్‌ట్యాగ్‌ను ట్వీటర్‌లో ట్రెండ్‌ చేశారు. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన పెద్ద చిత్రాలన్నింటికీ ఏదో ఒక రకంగా బాయ్‌కాట్‌ సెగ తగిలింది. 

ఈ బాయ్ కాట్ వివాదంపై ఇప్పటికే పలువురు హీరోలు స్పందించారు. తాజాగా తమిళ్‌ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌  ఈ బాయ్‌కాట్‌ వివాదంపై కాస్త వ్యంగంగా స్పందించారు. విక్రమ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం కోబ్రా చిత్రం ఆగస్ట్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో విక్రమ్‌ మీడియాతో ముచ్చటించారు.

(చదవండి: కోబ్రా సినిమా.. చాలా ఎమోషనల్‌ క్యారెక్టర్‌ నాది: విక్రమ్‌)

ఈ మధ్య కాలంలో బాయ్‌కాట్‌ మూవీస్‌ అంటూ పలు బాలీవుడ్‌ చిత్రాలను బహిష్కరించాలని నెటిజన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. విక్రమ్‌ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ‘అసల్‌ బాయ్‌కాట్‌ అంటే ఏంటి? బాయ్‌ అంటే తెలుసు..గర్ల్‌ బాగా అంటే తెలుసు.. చివరకు కాట్‌ అంటే కూడా నాకు తెలుసు కానీ.. బాయ్‌కాట్‌ అనే పదమే నాకు తెలియదు’అని విక్రమ్‌ చెప్పుకొచ్చాడు. 

ఇక కోబ్రా సినిమా విషయానికొస్తే.. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కేజీఎఫ్‌’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement