Chiyaan Vikram Discharged From Hospital After Fans Shares His Old Video - Sakshi
Sakshi News home page

Chiyaan Vikram: ఆస్పత్రి నుంచి హీరో విక్రమ్‌ డిశ్చార్జి.. పాత వీడియో వైరల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌

Published Mon, Jul 11 2022 12:34 PM | Last Updated on Mon, Jul 11 2022 1:51 PM

Chiyaan Vikram Discharged From Hospital After Fans Shares His Old Video - Sakshi

విలక్షణ నటుడు, తమిళ హీరో చియాన్‌ విక్రమ్‌ ఇటీవల ఆస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఆయనకు ఛాతిలో నొప్పిగా అనిపించడంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. అక్కడ రెండు రోజుల పాటు ఐసీయూలో చికిత్స తీసుకున్న ఆయన డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే మొదట ఆయనకు గుండెపోటు వచ్చిందంటూ తమిళ మీడియా, వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి. దీంతో విక్రమ్‌ ఆరోగ్యంపై ఆయన ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కోలుకుని పూర్తి ఆరోగ్యం తిరిగి రావాలని ప్రార్థించారు.

చదవండి: ది వారియర్‌ షూటింగ్‌లో దర్శకుడితో కాస్త ఇబ్బంది పడ్డా: కృతిశెట్టి

అయితే ఈ వార్తలను కావెరీ ఆస్పత్రి వైద్యులు, ఆయన తనయుడు ధృవ్‌ కొట్టిపారేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని ఛాతిలో కాస్తా ఇబ్బందిగా అనిపించడంతో ఆయన ఆస్పత్రికి వచ్చారని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే శనివారం డిశ్చార్జయిన ఆయన.. ఇంటి నుంచి ఓ వీడియో రిలీజ్‌ చేశారని, ఇందులో ఆయన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అది తాజా వీడియో కాదని తెలుస్తోంది. విక్రమ్‌ తన బర్త్‌ సందర్భంగా 2017లో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియో ఇది. తనకు శుభాకాంక్షలు తెలిపిన ఫ్యాన్స్‌కు విక్రమ్‌ ధన్యవాదాలు చెప్పిన వీడియోను కొందరు ఫ్యాన్స్‌, నెటిజన్లు రిపోస్ట్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

చదవండి: లక్కీ చాన్స్‌ చేజార్చుకున్న కీర్తి సురేశ్‌? ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు!

ఈ వీడియోతో విక్రమ్‌ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు అభిమానులు చెక్‌ పెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోలు విక్రమ్‌ ‘హాయ్‌ పీపుల్‌.. ఓ మై గాడ్‌ ఎంత ప్రేమ, ఎంత అభిమానం. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు నేను ఫిదా అయ్యాను. థ్యాంక్యూ ఎవ్రీవన్‌’ అని చెప్పుకొచ్చారు. ఏదేమైన ప్రస్తుతం విక్రమ్‌ ఆరోగ్యం నిలకడ ఉన్నట్లు కావేరి ఆస్పత్రి వైద్యులు తెలిపిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement