Ponniyin Selvan: I Movie OTT Release Date Out Now - Sakshi

Ponniyin Selvan: I: ఓటీటీలోకి వచ్చేసిన పొన్నియన్‌ సెల్వన్‌

Oct 28 2022 7:27 PM | Updated on Oct 28 2022 9:15 PM

Ponniyin Selvan: I Movie OTT Release Date Out Now - Sakshi

సినిమా రిలీజై దాదాపు నెల రోజులు అవుతుండటంతో ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌. తాజాగా ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేసింది..

స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన చిత్రం పొన్నియన్‌ సెల్వన్‌: మొదటి భాగం. చియాన్‌ విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, జయం రవి, కార్తీ, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ఏ ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. సెప్టెంబర్‌ 30న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజై దాదాపు నెల రోజులు అవుతుండటంతో ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్‌.

ఇదిలా ఉంటే పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 1 ఓటీటీ రైట్స్‌ అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! తాజాగా ఈ సినిమా నవంబర్‌ 4 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించింది అమెజాన్‌ ప్రైమ్‌. ఒకవేళ ఇప్పుడే చూడాలనుకుంటే మాత్రం దానికి డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే స్ట్రీమ్‌ కానున్నట్లు తెలపడంతో కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే హిందీ వర్షన్‌ రిలీజ్‌ చేయరా? అని మండిపడుతున్నారు.

చదవండి: పెళ్లి వార్తలపై స్పందించిన యంగ్‌ హీరోయిన్‌
తొక్కలో పంచాయితీ.. ఎంత చెప్పినా గీతూ వినదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement