
కారు నుంచి పామును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న నిపుణుడు (ఇన్‌సెట్‌లో పాము)
సాక్షి, నిజామాబాద్ నాగారం: నిజామాబాద్ జిల్లా విద్యుత్‌శాఖ కార్యాలయం ఆవరణలో నాగుపాము హల్‌చల్ చేసింది. పాత ఎస్‌ఈ కార్యాలయం ఎదుట ఓ ఉద్యోగి తన కారును పార్కింగ్ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికి వెళ్లుదామని కారు దగ్గరకు వెళ్లగానే పాము కనిపించింది. దీంతో ఉద్యోగులు, స్థానికులు పాము అంటూ అరవడంతో భయపడి అక్కడే పార్కింగ్ చేసిన కారులోకి చొచ్చుకెళ్లింది. ఎంతసేపటికీ బయటకు రాలేదు. దీంతో ఉద్యోగులు పాములు పట్టే నిపుణులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పామును పట్టుకుని వెళ్లారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకొని ఎవరి పనులకు వారు వెళ్లిపోయారు.