పైకప్పులో నాగుపాము: ర‌క్షించిన అధికారి | Forest Official Rescues Cobra From Rooftop In Goa | Sakshi
Sakshi News home page

పైకప్పులో నాగుపాము: ర‌క్షించిన అధికారి

May 22 2020 2:49 PM | Updated on Mar 22 2024 11:26 AM

ప‌నాజీ: ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో ఏమో కానీ, ఓ నాగుపాము ఇంట్లోకి దూరింది. త‌న ఉనికిని చాటుకుంతూ బుస్ అని ప‌డ‌గ కొట్టింది. దీంతో ఆ స‌ర్పాన్ని చూసి భ‌య‌భ్రాంతుల‌కు గురైన కుటుంబ స‌భ్యులు క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా అట‌వీశాఖ అధికారుల‌కు ఫోన్ కొట్టారు. దీంతో రంగంలోకి దిగిన అట‌వీ అధికారి హుటాహుటిన‌ స‌ద‌రు ఇంటికి చేరుకున్నాడు. ఈ విష‌యాన్ని ముందే ప‌సిగ‌ట్టిన‌ట్లుగా ఆ పాము అప్ప‌టికే పైక‌ప్పులోకి దూరి దాక్కుంది. దీంతో అత‌ను కూడా ఇంటి మీద‌కు ఎక్కి దాని కోసం వెతుకులాడాడు. అనంత‌రం దాని ఆచూకీ క‌నుగొన్న వెంట‌నే పామును నెమ్మ‌దిగా క‌ర్ర సాయంతో ప‌ట్టుకుని సంచిలోకి పంపించాడు. 

ఆ త‌ర్వాత‌ దాన్ని జాగ్ర‌త్త‌గా తీసుకెళ్లి అడ‌విలో వ‌దిలేశారు. ఈ అరుదైన ఘ‌ట‌న గోవాలోని కొటిగావో వ‌న్య‌ప్రాణుల అభ‌యార‌ణ్యానికి స‌మీపంలో చోటు చేసుకుంది. ఈ వీడియోను అట‌వీ అధికారి శైలేంద్ర సింగ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. చాలా మంది నెటిజ‌న్లు పామును ర‌క్షించిన అధికారిని కొనియాడుతూనే.. 'వాటిని కాపాడే స‌మ‌యంలో వాటి బారి నుంచి మిమ్మ‌ల్ని కాపాడేందుకు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోండ‌'ని సూచిస్తున్నారు. 'ఇలాంటి ప‌నుల కోసం ప్ర‌భుత్వం అట‌వీ శాఖ అధికారుల‌కు టూల్ కిట్ ఇస్తే బాగుంటుంద‌'ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement