భువనేశ్వర్: పెట్రోల్ పైపులో దూరి ఓ నాగుపాము హల్‌చల్ చేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు దాన్ని అడవిలోకి వదిలిపెట్టడంతో ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం..ఒడిశా మయూర్భంజ్ జిల్లాలోని ఓ పెట్రోల్ బంక్ పైపులో నాగుపాము దూరింది. వాహనాల్లో పెట్రోల్ నింపేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగా ఏదో అడ్డుగా ఉన్నట్లు గుర్తించారు. ఏంటా అని చూస్తే ఏకంగా నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. వెంటనే స్నేక్ రెస్క్యూ టీంకు సమాచారం అందించగా, సిబ్బంది వచ్చి పామును అడవుల్లో వదిలిపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో ప్రమాదం తప్పిదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (భయానకం: గోడ దూకి హోటల్లోకి వచ్చిన సింహం..)
Comments
Please login to add a commentAdd a comment