
మైసూరు: ప్లాస్టిక్ కవర్ల వల్ల జంతుజాలం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. నాగుపాము ఒకటి కప్పతో పాటు ప్లాస్టిక్ కవర్‌ను మింగి అవస్థ పడుతుండగా పాముల నిపుణుడు సపర్యలు చేసి కాపాడాడు. ఈ సంఘటన కొడగు జిల్లా కుశాలనగ దగ్గర గొంది బసవనహళ్ళి గ్రామంలో జరిగింది.
చెందిన శశి అనే వ్యక్తి ఇంటిలోకి వచ్చిన నాగుపాము ఇంటిలో దాక్కున్న కప్పతో పాటు ప్లాస్టిక్ కవర్‌ను పొరపాటును మింగేసింది. కవర్ గొంతులో అడ్డం పడి పాము విలవిలలాడసాగింది. అది చూసి పాములు నిపుణుడు అయిన గఫూర్‌కు కొందరు సమాచారమిచ్చారు. ఆయన దానికి నీటిని తాగించి కప్పతో పాటు ప్లాస్టిక్ కవర్‌ను బయటకు తీసి పామును దూరంగా విడిచిపెట్టాడు.