
Vikram: పాత్రకు తగ్గట్టు ఆ పాత్రధారిగా పరకాయప్రవేశం చేస్తారు హీరో విక్రమ్. ఇందుకు విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’, ‘ఐ’ వంటి సినిమాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకూ పలు సినిమాల్లో రెండు మూడు గెటప్స్‌లో కనిపించిన విక్రమ్ తన తాజా చిత్రం ‘కోబ్రా’లో దాదాపు ఇరవైకి పైగా గెటప్స్‌లో కనిపించనున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయింది.
తాజాగా ఈ సినిమాలోని విక్రమ్ కొత్త గెటప్‌ను షేర్ చేశారు దర్శకుడు అజయ్. అద్దం ముందు కూర్చుని, మేకప్ చేయించుకుంటున్న ఈ ఫొటోలో విక్రమ్ గుర్తుపట్టలేని విధంగా కొత్తగా కనిపిస్తున్నారు. ‘‘కోబ్రా’ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. వీలైనంత తొందరగా నార్మల్ డేస్ రావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు అజయ్.
చదవండి:
మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి!
రష్మిక షాకింగ్ నిర్ణయం, సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పాలనుకుందట!
Comments
Please login to add a commentAdd a comment