
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు : నాగపంచమి రోజున ఓ ఇంట్లోకి ప్రవేశించిన నాగు పాముకు స్థానికులు పూజలు నిర్వహించారు. వివరాలు.. శ్రీనివాసపురం పట్టణంలో వీరేంద్రకుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆదివారం నాగుపాము ఇంట్లోకి ప్రవేశించగా పాములు పట్టే నిపుణుడు అమీర్ చాంద్‌ను పిలిపించారు. దానిని పట్టుకునేందుకు యత్నిస్తుండగా బచ్చలిపైప్‌లోకి వెళ్లిపోయింది. దీంతో మరో వైపు నుంచి నీరుపోయడంతో పాము బయటకు రాగా స్నేక్‌రాజ్ ఒడిసి పట్టుకున్నాడు. అయితే నాగపంచమి రోజున ఇంటికి వచ్చిన నాగుపాముకు మహిళలు భక్తితో పూజలు చేశారు. అనంతరం పామును సురక్షితంగా అడవిలో వదలిపెట్టారు.
నేడు గరుడ పంచమి
తిరుమలలో సోమవారం గరుడ పంచమి ఘనంగా నిర్వహించనున్నారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితంలో ఆనందాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడపంచమి పూజ చేస్తారని ప్రాశస్త్యం. ఇందులో భాగంగా రాత్రి 7నుంచి 9గంటల వరకు మలయప్ప స్వామి తనకు ఇష్టవాహనమైన గరుడినిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. అలాగే ఈ నెల 15న గురువారం శ్రావణ పౌర్ణమినాడు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 9గంటలక వరకు శ్రీవారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment