
చెన్నై నగరంలో రష్యా దేశాన్ని సృష్టిస్తున్నారు ‘కోబ్రా’ టీమ్. తమిళ నటుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ పదికి పైగా గెటప్స్‌లో కనిపించనున్నారు. శ్రీనిథీ శెట్టి కథానాయిక. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కరోనా వల్ల వాయిదా పడింది. లాక్‌డౌన్ ముందు వరకూ రష్యాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్రబృందం.
తాజాగా విదేశీ షూటింగ్స్ కష్టంగా ఉన్నాయి. దాంతో చెన్నైలోనే రష్యాలో చిత్రీకరించాల్సిన సన్నివేశాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే రష్యాను తలపించే సెట్స్ వేస్తున్నారు. భారీ ఖర్చుతో చెన్నైలోనే రష్యాను తయారుచేస్తున్నారు. ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, దర్శకుడు కేయస్ రవికుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment